News October 9, 2024
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం పూజలు: డొక్కా

AP: వైసీపీ తప్ప రాజకీయ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్నాయని TDP నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం కుల గణన చేసినా వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ నెల 11న దుర్గామాత ఆలయాల్లో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో గవర్నర్, మంత్రులు, అఖిలపక్ష నేతలను కలుస్తామని అన్నారు.
Similar News
News December 11, 2025
మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.
News December 11, 2025
ఈ ఉదయం 7 గంటల నుంచి..

TG: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి మ.1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2PM నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది.. 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 5 గ్రామాలకు, 169 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి.
News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.


