News November 21, 2024

పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి

image

AP: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. వైసీపీ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News November 23, 2024

చైతూ బర్త్ డే.. ‘NC24’ నుంచి అప్డేట్

image

అక్కినేని నాగ చైతన్య హీరోగా ‘NC24’ను కార్తీక్ దండు తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చైతూ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, SVCC ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

News November 23, 2024

ఆ పార్టీలు కలిసిపోతాయా లేక ఉనికే కోల్పోతాయా?

image

మహారాష్ట్రలో పరాభవం శివసేన UBT, NCP SPకి ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్‌కు 5-6 సీట్లతో దూరమైన పార్టీలే ప్రాభవం కోల్పోతున్నాయి. ఆర్థిక వనరుల్లేక చతికిలపడుతున్నాయి. అలాంటిది విడిపోయి బలహీనపడిన పై పార్టీలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేకు వ్యూహరచన, పార్టీని నడపడంలో అనుభవం లేదు. సీనియర్ శరద్ పవార్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భవితవ్యం బోధపడటం లేదు.

News November 23, 2024

సైకిల్ స్పీడుకు బ్రేకులు వేసిన బీజేపీ

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉపఎన్నిక‌లు SP చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు ప‌రాభ‌వాన్ని మిగిల్చాయి. బీజేపీ, దాని మిత్రపక్షం RLD 7 చోట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి. గతంలో అఖిలేశ్ రాజీనామా చేసిన క‌ర్హ‌ల్‌ స్థానంతోపాటు, సిసామౌలో ఎస్పీ లీడింగ్‌లో ఉంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 37 స్థానాల్లో సొంతంగా గెలిచి జోరుమీదున్న SPకి ఈ ఫ‌లితాలతో బీజేపీ బ్రేకులు వేసినట్టైంది.