News August 12, 2025
పులివెందుల: పరువా? ప్రజాస్వామ్యమా?

పులివెందుల ZPTC ఉపఎన్నికల్లో ఓటేసేది 10,606 మంది. ఇదేం AP దశ, దిశను మార్చదు. కానీ నెల రోజులుగా అక్కడ నెలకొన్న హైడ్రామా పోలింగ్ రోజు పరాకాష్ఠకు చేరింది. ఇరుపార్టీల వారు దాడులు చేసుకునే స్థాయి దాటి ఇప్పుడు ఓటర్లు బయటకు రాకుండా కర్రలతో ఇళ్ల ముందు నిల్చోవడమనేది నిరంకుశత్వాన్ని తలపిస్తోంది. పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నా ఆగని పంతాలు, పట్టింపులు పులివెందుల పోరులో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
Similar News
News August 20, 2025
తీవ్ర నేరం చేస్తే సీఎం/పీఎం పదవి నుంచి ఔట్!

ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును NDA ప్రభుత్వం నేడు <<17458012>>లోక్‌సభలో<<>> ప్రవేశపెట్టనుంది. PMతో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే పదవిని కోల్పోతారు. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
News August 20, 2025
రేపు చిరు అభిమానులకు సర్‌ప్రైజ్

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కాగా, ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా157 నుంచి రేపు సాయంత్రం అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం.
News August 20, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇవాళ APలో ఎక్కడా స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు. TGలో మాత్రం ఒక్క నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా హాలిడే ఇచ్చారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా పాఠశాలలు నడవనున్నాయి. అయితే KMM, ములుగు, భూపాలపల్లి, ADB, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.


