News August 10, 2025

పులివెందుల ZPTC ఉపఎన్నిక.. ఓటుకు రూ.10,000

image

AP: ఈ నెల 12న జరిగే పులివెందుల ZPTC ఉపఎన్నికను TDP, YCP ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్‌కు కంచుకోటైన స్థానంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓటుకు ₹10,000 ఇచ్చేందుకు లీడర్లు సిద్ధమైనట్లు సమాచారం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTCలను గతంలో YCPనే గెలవగా, తిరిగి కైవసం చేసుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది.

Similar News

News August 12, 2025

అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి: రేవంత్

image

TG: అటవీశాఖలో ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ‘ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకులను పెంచాలి. నైట్ సఫారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అటవీ-రెవెన్యూ శాఖల మధ్య భూవివాదాలు పరిష్కారం చేయాలి’ అని ఆయన ఆదేశించారు.

News August 12, 2025

రికార్డులు కొల్లగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్

image

AUSతో 2వ T20లో సౌతాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్(125*) విధ్వంసం సృష్టించారు. దీంతో SA తరఫున అత్యధిక T20 వ్యక్తిగత స్కోర్(గతంలో డుప్లెసిస్ 119 రన్స్) కొట్టారు. AUSపై ఫాస్టెస్ట్ సెంచరీ 41బంతుల్లో(గతంలో కోహ్లీ 52బాల్స్), SA తరఫున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు(గతంలో రిచర్డ్ లెవి 24Y). కాగా బ్రెవిస్ IPLలో CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

News August 12, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటల లోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. మరి మీ ఏరియాలో వర్షం మొదలైందా? కామెంట్ చేయండి.