News September 14, 2024
రుచిగా ఉందని ఎక్కువగా లాగిస్తున్నారా?

ఆహారం తక్కువగా తీసుకుంటే పోషకాహారలోపం, ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఎప్పుడూ కంట్రోల్‌గా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా రుచిగా ఉందని ఎక్కువగా తింటే ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవసరమైన మోతాదులోనే కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలను తినాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 13, 2026
సంక్రాంతి: ఈ పరిహారాలు పాటిస్తే బాధలు దూరం

పుష్య మాసం, మకర రాశి శని దేవుడికి ప్రీతిపాత్రమైనవి. సంక్రాంతి రోజున శని అనుగ్రహం కోసం నువ్వుల నలుగుతో స్నానం చేయాలి. దారిద్ర్యం పోవాలంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయాలి. పితృదేవతలకు తర్పణాలు వదిలితే కుటుంబానికి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ రోజు పెరుగు దానం చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్షు లభిస్తాయి. ఈ చిన్న పరిహారాలు పాటిస్తే సకల బాధలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
News January 13, 2026
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News January 13, 2026
తప్పుడు కథనాలు, మార్ఫింగ్ ఫొటోల కేసులపై SIT ఏర్పాటు

TG: సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫొటోలు, మహిళా ఐఏఎస్‌పై తప్పుడు కథనాల కేసులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు కేసులను దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్‌లు శ్వేత, యోగేశ్ గౌతమ్ సహా మొత్తం 8 మంది పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.


