News October 9, 2025
ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్

TG: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో TG నుంచి HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, HNK జిల్లాలున్నాయి. వీటితో పాటు WGLలో ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 0-5 ఏళ్ల వయసు పిల్లలకు డ్రాప్స్ వేస్తారు. పోలియో కేసులు నమోదవుతున్న BAN వంటి దేశాల నుంచి INDకు రాకపోకల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News October 9, 2025
NCLలో 100 పోస్టులు

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 100 పారామెడికల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 13,700, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ,12,700 స్టైఫండ్ ఇస్తారు. వెబ్‌సైట్: https://www.nclcil.in/
News October 9, 2025
అట్ల తద్ది రోజున అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

అట్ల తద్ది రోజున గోరింటాకు పెట్టుకోవడం మాంగల్యానికి చిహ్నం. అందుకే ఈ పండుగను గోరింటాకు పండుగ అని కూడా అంటారు. గోరింటాకు ధరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి, మాంగల్య సౌభాగ్యం పెరుగుతుందని స్త్రీలు నమ్ముతారు. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్త్రీల శ్రేయస్సు కోసం ఏర్పడిన ఈ ఆచారాన్ని వివాహిత, అవివాహిత యువతులు పాటిస్తారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత అదృష్టం అని విశ్వాసం.
News October 9, 2025
నేడు పవన్, జగన్ పర్యటనలు

* AP Dy.CM పవన్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించనున్నారు.
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పేరిట నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.