News June 13, 2024
పంచ్, నెక్సాన్ ఈవీ మోడల్స్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్

పంచ్.ఈవీ, నెక్సాన్.ఈవీ మోడల్స్ భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్-NCAP) సేఫ్టీ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ సాధించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఈవీ కేటగిరీలో తొలి ఫైవ్ స్టార్ రెటింగ్ అందుకున్న మోడల్స్‌గా పంచ్, నెక్సాన్ నిలిచాయని తెలిపింది. పెద్దల సేఫ్టీలో పంచ్ 32కి 31.46 పాయింట్లు, నెక్సాన్ 29.86/32 సాధించాయి. ఇక చైల్డ్ సేఫ్టీలో పంచ్ 45/49, నెక్సాన్ 44.95/49 నమోదు చేశాయి.
Similar News
News November 20, 2025
WNP: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లుపూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ గిరిధర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసీసీ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎంసీసీ ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలన్నారు.
News November 20, 2025
బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72 సమాధానాలు

నేటి ప్రశ్న: కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకు పోవడానికి, అది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి?
జవాబు: ఓసారి కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీస్తూ నెయ్యి తడిసిన మట్టిని చేతులతో బలంగా పిండాడు. ఈ చర్యతో బాధపడిన భూమాత ఆగ్రహించింది. ‘నువ్వు నాకు ఈ బాధకు కలిగించినందుకు ప్రతిచర్యగా నీ జీవితంలో అతి కీలకమైన యుద్ధ సమయంలో నీ రథ చక్రాన్ని నేలలో బలంగా పట్టుకుంటాను’ అని శపించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


