News June 21, 2024

పుణే యాక్సిడెంట్.. నిందితుడి తండ్రికి బెయిల్

image

పుణేలో కారుతో ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందితుడి(17) తండ్రి విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరైంది. మే 19న మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపిన ఆ బాలుడు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మృతికి కారణమయ్యాడు. కాగా తమ కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు బ్లడ్ శాంపిల్స్ మార్చారనే కారణంతో తండ్రి విశాల్ అగర్వాల్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పుణేలోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Similar News

News February 1, 2026

ఫోన్ ట్యాపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రెండేళ్లుగా సీరియల్ కింద సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘జడ్జీలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారు. తన భర్త ఫోనూ ట్యాప్ చేశారని కవిత అన్నారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు తమ వాటాల కోసం కొట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

News February 1, 2026

బడ్జెట్‌పై భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్!

image

ఈసారి బడ్జెట్‌పై జియోపాలిటిక్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేర్ ఎర్త్ మెటల్స్‌పై చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటించింది. అణువిద్యుత్‌కు సంబంధించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీపై 2035 వరకు మినహాయింపు, సెమీకండక్టర్ మిషన్ 2.0 లాంచ్ విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు తీసుకున్న చర్యలుగా తెలుస్తోంది. రక్షణ పటిష్ఠం చేసేందుకు డిఫెన్స్‌లోనూ భారీగా నిధులు కేటాయించింది.

News February 1, 2026

4 గంటలు.. అటు కేసీఆర్ విచారణ.. ఇటు ఆందోళనలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు 4 గంటలుగా విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రశ్నలకు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.