News May 24, 2024

పుణే యాక్సిడెంట్.. ఇద్దరు పోలీసులు సస్పెండ్

image

పుణే కారు ప్రమాదం కేసులో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ వెల్లడించారు. డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ రాహుల్ జగ్దాలే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ తోడ్కారీ ప్రమాదం గురించి వైర్‌లెస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. కాగా.. పుణేలో ఓ మైనర్(17) మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన విషయం తెలిసిందే.

Similar News

News January 20, 2026

కరూర్ తొక్కిసలాట.. నిందితుడిగా విజయ్ పేరు?

image

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి CBI <<18898953>>విచారణకు<<>> నిన్న రెండోసారి విజయ్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలో ఆయన్ను నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఏడీజీపీ, మరో పోలీసు అధికారిపైనా అభియోగాలు మోపే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని, అందులో విజయ్ పేరు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు.

News January 20, 2026

విజయ్‌తో పెళ్లి.. త్వరలో క్లారిటీ: రష్మిక

image

హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ రష్మిక ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడుతాను. అప్పుడే నిజం తెలుస్తుంది’ అని చెప్పారు. వచ్చే నెలలో వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

News January 20, 2026

50% రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

image

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దీని వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.