News June 25, 2024
పుణే పోర్షె కేసు.. నిందితుడి విడుదలకు హైకోర్టు ఆదేశం

పుణే పోర్షె కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మైనర్ అయిన నిందితుడికి రిమాండ్ విధించడాన్ని తప్పుపట్టిన కోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రిమాండ్ చట్టవిరుద్ధమని ధర్మాసనం తెలిపింది. యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరమే అయినా మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచడం సరికాదని పేర్కొంది. ఈ కేసులో నిందితుడి తల్లిదండ్రులు, తాత సైతం జైలులో ఉండటంతో అతని సంరక్షణ బాధ్యతలను మేనత్తకు అప్పగించింది.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


