News February 24, 2025

తప్పుడు ఏజెంట్లపై పంజాబ్ సర్కార్ ఉక్కుపాదం

image

భారతీయులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 40 మంది ట్రావెల్ ఏజెంట్ల లైసెన్సులను పంజాబ్ సర్కార్ రద్దు చేసింది. 271 మంది ఏజెంట్లకు నోటీసులు జారీ చేసింది. అన్ని ట్రావెల్ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ప్రయాణికుల రికార్డులు కచ్చితంగా ఉండాలని హెచ్చరించింది. కాగా కొందరు ఏజెంట్లు పలువురు భారతీయులను డంకీ రూట్ ద్వారా US చేర్చారు. ఇటీవల వారిని అమెరికా బంధించి తిరిగి ఇండియాకు పంపింది.

Similar News

News February 3, 2026

ఆసీస్‌కు మరో షాక్.. ప్రారంభ మ్యాచ్‌లకు హేజిల్‌వుడ్‌ దూరం

image

T20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీకి కమిన్స్ దూరమవ్వగా, తాజాగా ఆ జట్టు కీలక బౌలర్ హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచులకు దూరంకానున్నారు. కాలి మడమ నొప్పి గాయం నుంచి కోలుకుంటున్న హేజిల్‌వుడ్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో అతడి స్థానంలో రిజర్వ్ పేసర్‌గా సీన్ అబాట్‌కు అవకాశం కల్పించారు.

News February 3, 2026

సమీకృత వ్యవసాయంలో ఈ రైతు విజయం ఆచరణీయం

image

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.

News February 3, 2026

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<>GSL<<>>) 25 ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/BSc(Engg.) అర్హత గలవారు FEB 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, DV, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://goashipyard.in