News April 2, 2025
రిషభ్ పంత్‌కు పంజాబ్ కింగ్స్ కౌంటర్

మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌పై PBKS కౌంటర్ ఇచ్చింది. రాత్రి LSGపై మ్యాచ్ గెలిచిన తర్వాత ‘మెగా వేలం టెన్షన్ దానంతటదే ముగిసింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాగా వేలం అనంతరం పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వేలంలో పంజాబ్ నన్ను ఎక్కడ కొంటుందో అని టెన్షన్ పడ్డా. శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకోవడంతో లక్నో టీమ్‌లో చేరగలనని భావించా’ అంటూ చెప్పుకొచ్చారు.
Similar News
News October 23, 2025
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

AP: రైతుల నుంచి కనీస మద్దతు ధరకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదై, సీఎం యాప్ ద్వారా లాగిన్ అయి, ఆధార్ అనుసంధానంతో కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ ప్రకారం పత్తిని CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. రైతులకు సందేహాలుంటే 7659954529కు కాల్ చేయొచ్చు.
News October 23, 2025
‘కపాస్ కిసాన్ యాప్’లో నమోదు ఎలా?

యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.
News October 23, 2025
స్థానిక ఎన్నికలే అజెండా.. మరికొన్ని గంటల్లో క్యాబినెట్ భేటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈరోజు 3PMకు క్యాబినెట్ భేటీ కానుంది. నిలిచిపోయిన ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలో సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది.


