News April 19, 2024
పంజాబ్ సూపర్ ఫైట్.. మ్యాచ్ వన్‌సైడ్ అనుకుంటే..

ఈ IPLలో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నమోదైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ తొలుత తడబడినా తర్వాత బలంగా నిలబడింది. 7 ఓవర్లకే టాప్, మిడిల్ ఆర్డర్లు కూలినా.. శశాంక్ 41(25), అశుతోశ్ 61(28) పోరాడటంతో ముంబైకి విజయం అంత సులువుగా దక్కలేదు. టెయిలెండర్లు సైతం MIని టెన్షన్ పెట్టారు. ఈ సీజన్‌లో ఢిల్లీ, RCB, GT, SRH, RRతో మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఆటను చివరి వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది.
Similar News
News September 13, 2025
మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.
News September 13, 2025
మైథాలజీ క్విజ్ – 4

1. అర్జునుడు తపస్సు చేసి, ఎవర్ని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందాడు?
2. శూర్పణఖ ఎవరి చెల్లి?
3. ‘త్రిసూర్ పురం’ అనే పండగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ‘నవకళేబర’ ఉత్సవం ఏ ఆలయంలో జరుగుతుంది?
5. హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణు అవతారం ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను ‘మైథాలజీ క్విజ్-5’(రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
News September 13, 2025
నేడు మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.