News March 22, 2024

పురందీశ్వరి రాజీనామా అంటూ ప్రచారం.. ఖండించిన బీజేపీ

image

ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పదవికి పురందీశ్వరి రాజీనామా చేశారనే వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ BJP స్పందించింది. ‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ లెటర్ ఒక ఫేక్ లెటర్. ఎన్డీయే కూటమి వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని గమనించగలరు’ అని ట్వీట్ చేసింది. కాగా, విశాఖ తీరంలో దొరికిన డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో రాజీనామా చేస్తున్నానని పురందీశ్వరి పేరిట ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు.

Similar News

News November 13, 2025

Today Headlines

image

*ఢిల్లీ పేలుడు ఉగ్రదాడేనన్న కేంద్ర క్యాబినెట్.. కారకులను చట్టం ముందు నిలబెడతామని తీర్మానం
*ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే
*3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
*మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
*రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదన్న TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
*UPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల

News November 13, 2025

బ్లాస్ట్ చేసిన వారికే కాంగ్రెస్ సపోర్ట్: బీజేపీ

image

ఢిల్లీ బ్లాస్ట్ కారకులకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని BJP మండిపడింది. ఎన్నికల సమయంలోనే ఉగ్రవాద దాడులు జరగడానికి కారణమేంటని సిద్దరామయ్య ప్రశ్నించడంపై ఫైర్ అయింది. సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, వారివి దిగజారుడు రాజకీయాలని BJP కర్ణాటక చీఫ్ విజయేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.

News November 13, 2025

SC, ST యువతకు ఉచితంగా సివిల్స్ కోచింగ్: మంత్రి

image

AP: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా UPSC సివిల్స్ శిక్షణ ఇస్తామని మంత్రి DBV స్వామి తెలిపారు. రాష్ట్రంలోని 340 మందికి విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో ఫ్రీగా ప్రిలిమ్స్ శిక్షణ అందిస్తామన్నారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 13 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సైట్ https://apstudycircle.apcfss.in