News October 20, 2024

మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు

image

TG: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి, MD శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధర పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాఫెడ్ తరఫున జగిత్యాల, నిర్మల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. కాగా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,225 ఉండగా మార్కెట్లో రూ.2వేలు పలుకుతోంది.

Similar News

News October 20, 2024

టీటౌన్ రూమర్: OG మూవీలో అకీరా నందన్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.

News October 20, 2024

పెట్రోల్ దాడిలో బాలిక మరణం కలచివేసింది: అనిత

image

AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక <<14403526>>మరణించడం<<>> దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

News October 20, 2024

అశోక్‌నగర్‌లో మళ్లీ ఉద్రిక్తత

image

TG: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రేపటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.