News September 10, 2024

గోపీచంద్‌తో పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా?

image

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాను హీరో గోపీచంద్‌తో చేసే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గోలీమార్’ మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా పూరీ డైరెక్ట్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీనువైట్లతో చేస్తున్న ‘విశ్వం’తో బిజీగా ఉన్నారు.

Similar News

News October 19, 2025

నటి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

image

బిహార్ ఎన్నికల వేళ భోజ్‌పురి నటి సీమా సింగ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. NDA కూటమి అభ్యర్థి(LJP)గా ఆమె దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్‌లో లోపాలున్నాయని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో చాప్రా(D) మఢేరా అసెంబ్లీ స్థానంలో RJD, JSP మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే నామినేషన్‌లోని చిన్నలోపంపై SECకి వివరించామని, సమస్య పరిష్కారమవుతుందని LJP చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పారు.

News October 19, 2025

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు

image

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్ 50 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/

News October 19, 2025

వరి కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్‌లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.