News July 14, 2024

నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం

image

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్‌రథ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19 వరకు దేవతా మూర్తులు ఆలయం బయటే ఉండనున్నాయి. ఈ కారణంగానే లెక్కింపు వివరాల్ని వెల్లడించనట్లు తెలుస్తోంది.

Similar News

News January 5, 2026

27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

image

వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కోసం దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 27న సమ్మె బాట పట్టనున్నారు. 2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనికి ఒప్పుకుందని 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే UFBU తెలిపింది. అయినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది. ఆర్బీఐ, ఎల్ఐసీ, జీఐసీ వంటి సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

News January 5, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

News January 5, 2026

అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

image

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.