News May 16, 2024
పర్పుల్ పటేల్ మళ్లీ.. టాప్5లో అంతా మనోళ్లే..
2021లో 32 వికెట్లు తీసిన పర్పుల్ పటేల్‌గా పేరు తెచ్చుకున్న హర్షల్ పటేల్ మళ్లీ బౌలింగ్‌లో టాప్-1లోకి వచ్చారు. 13 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఈ పంజాబ్ కింగ్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా (20 వికెట్లు), KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(18), RR లెగ్ స్పిన్నర్ చాహల్(17), ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్(17) టాప్5లో ఉన్నారు.
Similar News
News January 8, 2025
BREAKING: ఫలితాలు విడుదల
తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <
News January 8, 2025
రేపటి నుంచి SAT20: భారత్ నుంచి ఒక్కడే
రేపటి నుంచి SAT20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. క్లాసెన్, బట్లర్, జాన్సెన్, విల్ జాక్స్, మార్క్రమ్, మిల్లర్, జాసన్ రాయ్, డుప్లెసిస్, డికాక్, పూరన్, స్టొయినిస్, రషీద్ ఖాన్, పొలార్డ్, సామ్ కరన్, సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్లు ఆడతారు. భారత్ నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఈ టోర్నీలో ఆడనున్నారు. పర్ల్ రాయల్స్ తరఫున ఆయన బరిలోకి దిగుతారు.
News January 8, 2025
చాహల్ భార్యతో సన్నిహిత ఫొటో: స్పందించిన కొరియోగ్రాఫర్
టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.