News October 5, 2025

‘పూర్వోదయ స్కీమ్‌’ను సద్వినియోగం చేసుకోవాలి: CM

image

AP: కేంద్రం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని CM చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై సమీక్షించారు. ఉద్యాన పంటలు, ఫిషరీస్, ఆక్వా తదితర రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని, సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్నారు.

Similar News

News October 5, 2025

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్

image

2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారింది. భవిష్యత్తులో తమ MLAలు ఎవరూ BJPలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ MLAలు BJPలో చేరారు’ అని గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.

News October 5, 2025

IND వార్నింగ్.. పాక్ రిప్లై ఇదే!

image

ప్రపంచ పటం నుంచి లేపేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ ఆర్మీ స్పందించింది. ‘భారత నేతలు, ఆర్మీ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమూ గట్టిగా స్పందిస్తాం. భారత్‌లోని ప్రతి మూలకు మా దళాలు వెళ్లగలవు. ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీయొచ్చు. ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడం అనేది పరస్పరం ఉంటుంది’ అని హెచ్చరించింది.

News October 5, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్‌గా వివేక్?

image

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి రోజుకో అప్‌డేట్ SMలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కీలక పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల 5 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.