News October 1, 2024

IIScలో రిజర్వేషన్ కటాఫ్‌పై నెట్టింట చర్చ

image

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో అడ్మిషన్ కోసం రాసే JAM రిజర్వేషన్ కటాఫ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జనరల్ కేటగిరీ విద్యార్థికి 76వ ర్యాంకు వచ్చినా సీటు రాదని, ST కేటగిరీలో 4వేల ర్యాంకు వచ్చినా అడ్మిషన్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏ ర్యాంకు విద్యార్థి మెరుగైన పరిశోధన చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పరిశోధన రంగంలోనైనా మెరిట్ చూడాలంటున్నారు.

Similar News

News October 1, 2024

రాహుల్‌గాంధీ సిటిజన్‌షిప్ PIL: టైమ్ కావాలన్న కేంద్రం

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం రద్దుపై తమకు అభ్యర్థన అందిందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై చర్యలు తీసుకొనేందుకు కాస్త సమయం కావాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు తెలిపింది. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తర్వాత ఆ డాక్యుమెంటును ఎందుకు క్యాన్సిల్ చేశారో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ హైకోర్టులో వేసిన పిల్‌కు వివరణ ఇచ్చింది.

News October 1, 2024

డిసెంబర్ 25న ‘గేమ్ ఛేంజర్’ విడుదల: దిల్ రాజు

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ‘రా మచ్చా మచ్చా’ ఈవెంట్‌లో ఆయన ప్రకటించారు. అయితే, గతంలో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండటంతో క్రిస్మస్‌కి ప్లాన్ చేశారు. కాగా, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది.

News October 1, 2024

లడ్డూ వివాదం.. నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు

image

AP: తిరుమల లడ్డూ అంశంలో CM చంద్రబాబు, ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు TDP కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు, న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తుడని, ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది.