News November 27, 2024
‘పుష్ప-2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?

‘పుష్ప-2’ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా, ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 30 లేదా డిసెంబర్ 1న బుకింగ్స్ ఓపెన్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రీ సేల్ ఇప్పటికే యూఎస్లో మొదలైంది. ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదల కానుంది.
Similar News
News January 2, 2026
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు-5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ తన ప్రియురాలిని పరిచయం చేశారు. కొంతకాలంగా తన రిలేషన్షిప్ స్టేటస్పై సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ‘gods plan❤️’ అంటూ తన ప్రియురాలితో ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. అయితే ఆమె ఫేస్, పేరు రివీల్ చేయలేదు. ఆయనకు అభిమానులు, ఫాలోవర్స్ అభినందనలు చెబుతున్నారు. 2021లో యూట్యూబర్ దీప్తి సునయనతో బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.
News January 2, 2026
BSNL వార్షిక ప్లాన్.. రూ.2,799తో డైలీ 3GB

యూజర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్ను స్టార్ట్ చేసింది. రూ.2,799తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ లభించనున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ టెలికం సంస్థలతో పోల్చితే ఇదే తక్కువ కావడం విశేషం. గతంలో ఈ ప్లాన్ ధర రూ.2,399 (డైలీ 2GB)గా ఉండేది. 5Gతో పాటు వేగవంతమైన ఇంటర్నెట్ అందించాలని యూజర్లు కోరుతున్నారు.
News January 2, 2026
ఇంట్లోని ఈ వస్తువులు యమ డేంజర్!

మనం శుభ్రంగా ఉంటాయని భావించే వస్తువులే బ్యాక్టీరియాకు అసలైన నిలయాలు. పబ్లిక్ టాయ్లెట్ సీటు కంటే సూపర్ మార్కెట్ <<18742127>>ట్రాలీలు<<>>, ATM & లిఫ్ట్ బటన్లపై 40 రెట్లు ఎక్కువ క్రిములుంటాయని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్స్, ఆఫీస్ కీబోర్డులు, వంటగదిలోని స్పాంజ్లు, రిమోట్లు ఇన్ఫెక్షన్లకు కారకాలు. వందల మంది తాకే ఈ వస్తువుల ద్వారా 80% వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని వాడాక చేతులను శానిటైజ్ చేసుకోవడం బెటర్.


