News December 19, 2024

పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్!

image

విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్కును దాటింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా దాటిన భారత సినిమాగా చరిత్రకెక్కింది. మూవీ టీమ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మూవీ రూ.1508 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమా లెక్కల్ని, బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తోందని ప్రకటించింది.

Similar News

News December 29, 2025

చంద్రబాబుకు కోపం వస్తుందనే ప్రాజెక్టును ఆపేశారు: కేటీఆర్

image

TG: పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే సీఎం రేవంత్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనబెట్టారని కేటీఆర్ విమర్శించారు. ’45 టీఎంసీలకు ఒప్పుకుంటే అన్యాయం చేసినట్లే. ప్రాజెక్టు కడితే KCRకు పేరు వస్తుంది. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే రేవంత్ పాత బాస్ బాబుకు కోపం వస్తుందనే ప్రాజెక్టును ఆపేసి కాలువలు కూడా తవ్వడం లేదు’ అని మీడియాతో చిట్‌చాట్‌లో ఆరోపించారు.

News December 29, 2025

వరి నారుమడిని చలి నుంచి ఎలా రక్షించుకోవాలి?

image

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.

News December 29, 2025

పోలీసుల్నే బురిడీ కొట్టించారు.. ₹లక్షలు స్వాహా!

image

ఆన్‌లైన్ మోసాల కేసులు చూసే సైబర్ క్రైమ్ పోలీసులే డబ్బు పోగొట్టుకున్నారు. TTD దర్శన టికెట్స్ కోసమని ఓ అధికారి ₹4 లక్షలు కోల్పోయారు. ఇక స్టాక్స్‌లో లాభాలు అని ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయగా మరో ఇన్‌స్పెక్టర్ ₹39L నష్టపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆ ఆఫీసర్స్ ఇద్దరూ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఈ పోలీసుల అతి నమ్మకం, అత్యాశ తప్ప దొంగల అతి తెలివేం లేదు.