News November 21, 2024
‘పుష్ప 2’:శ్రీలీల స్పెషల్ సాంగ్‌పై బిగ్ అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న రాత్రి 7.02 గంటలకు ‘కిస్సిక్’ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు వేశారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న మూవీ విడుదల కానుంది.
Similar News
News February 21, 2026
NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.
News February 21, 2026
నేరేడుకు నీరు, పోషకాలు ముఖ్యం

నేరేడు తోటల్లో అధిక దిగుబడి రావాలంటే చెట్లకు తగిన పోషకాలను, నీటిని కూడా అందించాలి. అందుకే పంట పూత నుంచి పిందెలు, కాయలు ఏర్పడే దశలో నిపుణుల సూచనలతో తగిన మోతాదులో ఒకసారి యూరియా, పొటాష్ అందిస్తే అవి పండ్ల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే డ్రిప్ పద్ధతిలో తోటలకు నీరు అందిస్తుంటే.. ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతిలో ఇవ్వాలి. దీని వల్ల మంచి నాణ్యతతో కూడిన దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది.


