News December 26, 2024
రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్వైడ్గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.
Similar News
News January 27, 2026
తల్లి వద్దే భావోద్వేగాలు.. ఎందుకంటే?

పిల్లలు తమ కోపాన్ని, ఏడుపును ఎక్కువగా తల్లి ముందే చూపిస్తుంటారు. దీనికి కారణం అమ్మపై ఉన్న నమ్మకమేనని నిపుణులు చెబుతున్నారు. ‘తాము ఎలా ప్రవర్తించినా తల్లి వదిలి వెళ్లదని, ఆమె వద్దే తమకు రక్షణ ఉంటుందని వారు భావిస్తారు. పిల్లలు అమ్మ దగ్గరే అన్ని భావోద్వేగాలనూ స్వేచ్ఛగా బయటపెడతారు. ఇది వారి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి గుర్తు. అందుకే అరిస్తే కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News January 27, 2026
కళ్ల కింద ముడతలు తగ్గాలంటే?

అందంగా కనిపించాలంటే మేకప్ వేస్తే సరిపోదు ముఖంపై ముడతలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కళ్ల కింద ముడతలు వృద్ధాప్య ఛాయలకు సంకేతాలు. వీటిని తగ్గించాలంటే రెండు చేతుల చూపుడూ, మధ్య వేళ్లను ముందుగా కంటికొలను దగ్గర పెట్టి….చూపుడు వేలుని మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొన దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మధ్య వేలితో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచాలి. ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి.
News January 27, 2026
భానుచందర్ ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

సీనియర్ నటుడు భానుచందర్ లేటెస్ట్ లుక్ బయటకొచ్చింది. తాను తీస్తోన్న సినిమాలో నటించేందుకు భానుచందర్ ఓకే చెప్పారంటూ ఓ యువ డైరెక్టర్ ఇన్స్టాలో ఫొటో పోస్ట్ చేయగా వైరలవుతోంది. అందులో తెల్లటి గడ్డంతో స్లిమ్గా అయిపోయిన భానుచందర్ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిరీక్షణ సినిమాతో సినీ ప్రేమికులకు దగ్గరైన ఆయనను చాలా కాలం తర్వాత చూసి ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 73ఏళ్లు.


