News November 4, 2024
పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదుగా!

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కేరళలో ఇప్పటికే 50 ఫ్యాన్స్ షోలకు బుకింగ్ స్టార్ట్ అయినట్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. కేరళలో మొత్తం 300కు పైగా ఫ్యాన్స్ షోలు ప్రదర్శించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. DEC5న కేరళలో వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుందంటూ Xలో పోస్ట్ చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రష్మిక, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.
Similar News
News January 14, 2026
చితిపై నుంచి లేచిన బామ్మ.. ఆ తర్వాత..

మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలో వింత ఘటన జరిగింది. 103 ఏళ్ల గంగాబాయి చనిపోయిందని కుటుంబసభ్యులు భావించి.. బంధువులకు కబురు పంపారు. ముక్కులో దూది పెట్టి అంతిమ యాత్రకు సిద్ధమయ్యారు. ఇంతలో ముడివేసిన గంగాబాయి కాలి వేళ్లు కదలడాన్ని మనవడు గమనించాడు. వెంటనే దూది తీసేయగా ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. అదేరోజు గంగాబాయి పుట్టినరోజు కావడం విశేషం. దీంతో వీడ్కోలుకు వచ్చినవారు హ్యాపీగా కేక్ తిని వెళ్లిపోయారు.
News January 14, 2026
ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.
News January 14, 2026
గంజితో ఎన్నో లాభాలు

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.


