News December 3, 2024
రికార్డు సృష్టించిన ‘పుష్ప-2’

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్లో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్స్ బుకింగ్ జరిగినట్లు మేకర్స్ వెల్లడిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈనెల 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఇప్పటికే తెలంగాణలో బుకింగ్స్ మొదలవగా వేగంగా అమ్ముడవుతున్నాయి.
Similar News
News December 9, 2025
ఎస్క్రో అకౌంట్ అంటే?

ఎస్క్రో ఖాతా అనేది థర్డ్ పార్టీ నిర్వహించే తాత్కాలిక అకౌంట్. ఇందులో కొనుగోలుదారు, విక్రేతల లావాదేవీకి సంబంధించిన డబ్బు/ఆస్తులను ఉంచుతారు. ఒప్పందంలోని షరతులు నెరవేరిన తర్వాతే అవి సంబంధిత పార్టీలకు విడుదలవుతాయి. ఇది 2 పక్షాలకు భద్రతను అందిస్తుంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం మాత్రమే చెల్లింపు జరుగుతుందని ఇది నిర్ధారిస్తుంది. మన దేశంలో ఎస్క్రో అనేది పరిశ్రమలు, వ్యాపారం తదితర లావాదేవీలలో ఉపయోగిస్తారు.
News December 9, 2025
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?

కొన్ని అలవాట్లు అశుభకరమని పండితులు చెబుతున్నారు. ‘మాటిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం దోషం. నిలబడి, తిరుగుతూ అన్నం తింటే దరిద్రులవుతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం అశుభానికి సంకేతం. నదిలో ఉమ్మడం దైవ దూషణతో సమానం. కంచంను ఒడిలో పెట్టుకొని, పడుకొని తినకూడదు. కంచంలో చేయి కడగడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు వీడితే శుభాలు కలిగి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది’ అని సూచిస్తున్నారు.
News December 9, 2025
PHC స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను PHC స్థాయిలోనే సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదైనట్లు చెప్పారు. 9 మరణాలూ అనుమానిత కేసులు మాత్రమే అని, లోతైన పరీక్షలకు జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామన్నారు. కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.


