News November 7, 2024

రికార్డు సృష్టిస్తోన్న ‘పుష్ప-2’

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ చేసిందన్నారు. విడుదల తేదీ నాటికి రికార్డు ప్రీ కలెక్షన్లు సాధిస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Similar News

News December 23, 2025

ఇష్టానుసారం ICU ఛార్జీల వసూళ్లు కుదరదు: కేంద్రం

image

ఎమర్జెన్సీ చికిత్స బాధ్యత కావాలని, ఆర్థిక దోపిడీకి ఆసరాగా చూడొద్దని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కేంద్రం సూచించింది. వెంటిలేటర్, ICU ఛార్జీలను పబ్లిక్‌గా డిస్‌ప్లే చేయాలని చెప్పింది. ఆక్సిజన్/వెంటిలేటర్‌ వాడిన సమయానికి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. 2024లో వెంటిలేటర్ పరిశ్రమ మార్కెట్ విలువ 207 మిలియన్ USDగా రికార్డైంది. భవిష్యత్తులో మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News December 23, 2025

అరటి సాగుకు అనువైన రకాలు

image

అరటి ఉత్పత్తిలో దేశంలోనే AP తొలిస్థానంలో ఉంది. ఈ పంట సాగుకు సారవంతమైన తగిన నీటి వసతి కలిగిన భూమి అనుకూలం. అలాగే నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగిన సేంద్రియ పదార్థము గల నేలలు అనుకూలం. పండ్ల కోసం కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, గ్రాండ్‌నైన్, పొట్టి పచ్చ అరటి.. కూర కోసం కొవ్వూరు బొంత, గోదావరి బొంత రకాలు అనుకూలం. తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, బొంత రకాలను ఏడాది పొడవునా నాటవచ్చు.

News December 23, 2025

‘శివాజీ డర్టీ గాయ్’.. RGV ఘాటు వ్యాఖ్యలు

image

హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు <<18646239>>శివాజీ <<>>చేసిన వ్యాఖ్యలకు సంబంధించి RGV ఘాటుగా స్పందించారు. ‘నాకు అతని పూర్తి పేరు తెలీదు. హేయ్ శివాజీ నువ్వు ఎవరైనా కావొచ్చు. నీలాంటి డర్టీ గాయ్‌ని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై నీ చాదస్తాన్ని ప్రదర్శించు. సొసైటీలోని మిగతా మహిళలు, ఇండస్ట్రీలోని వాళ్లు, ఇంకా ఎవరైనా కావొచ్చు.. వారి విషయంలో నీ నిర్ణయాలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుకో’ అని ట్వీట్ చేశారు.