News October 6, 2024

‘పుష్ప2’: త్రిప్తిని సుకుమార్ రిజెక్ట్ చేశారా?

image

‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘పుష్ప2’ ఐటమ్ సాంగ్‌లో సందడి చేయబోతున్నారని కొద్దికాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమెను సుకుమార్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆమె కొత్త మూవీ ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లోని ‘మేరే మెహబూబ్’లో స్టెప్పులు వేయగా దానిపై విపరీతమైన ట్రోలింగ్ రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పునరాలోచనలో పడ్డ సుక్కు ఆమెను ఆడిషన్స్‌లోనే తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News December 16, 2025

గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరం: శశిథరూర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ (గ్రామీణ్)’ (VBGRAMG) అని పేర్కొంది. అయితే దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరమని, మహాత్ముడిని అగౌరవపరచొద్దని కాంగ్రెస్ MP శశి థరూర్ కోరారు.

News December 16, 2025

డిసెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం
* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం
* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం
* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు
* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం)

News December 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.