News November 20, 2024
ఈనెల 24న చెన్నైలో ‘పుష్ప-2’ ఈవెంట్!

‘పుష్ప-2’ సినిమా టీమ్ ఈనెల 24న చెన్నైలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 27న కొచ్చిలో ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబై, కోల్ కతా, HYDలోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా జనం వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Similar News
News December 18, 2025
విజనరీ లీడర్కు కంగ్రాట్స్: పవన్

AP: ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు <<18602632>>ఎంపికైన<<>> సీఎం చంద్రబాబుకు Dy.CM పవన్ కంగ్రాట్స్ చెప్పారు. IT, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన పాలనలో ఆయన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ‘CBN ఒక విజనరీ లీడర్. ఆయన పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేస్తోంది. దేశం, రాష్ట్రాన్ని వృద్ధి పథంలో నడిపించేందుకు ఆయనకు బలం చేకూరాలి’ అని ట్వీట్ చేశారు.
News December 18, 2025
వారికి నీళ్లిచ్చి మీ బాటిల్ సంగతి చూద్దాం: CJI

ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్ బాటిళ్లకు WHO ప్రమాణాలు పాటించేలా FSSAIని ఆదేశించాలని దాఖలైన పిల్పై CJI ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది అర్బనైజ్డ్ రిచ్ ఫోబియా’ పిల్ అని పేర్కొన్నారు. ‘ముందు దేశంలో తాగేందుకు మంచి నీళ్లు లేని వారి గురించి ఆలోచిద్దాం. బాటిళ్ల సంగతి తర్వాత చూద్దాం. గాంధీ తొలిసారి దేశానికి వచ్చి కుగ్రామాలకు వెళ్లినట్లు మీరూ పర్యటిస్తే పరిస్థితి తెలుస్తుంది’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
News December 18, 2025
మీరు సెకండ్ సిమ్ వాడుతున్నారా?

టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యులపై భారం మోపడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా రెండో సిమ్ వాడేవారు అనవసరంగా డేటా ప్లాన్లు కొనాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘డేటా లేకుండా కాల్స్& SMSలతో రీఛార్జ్ ప్యాక్స్ తీసుకురావాలి’ అని కోరుతున్నారు. చాలా ఇళ్లలో బ్రాడ్బ్యాండ్ ఉన్నా కంపెనీలు బలవంతంగా డేటా ప్యాకేజీలను రుద్దుతున్నాయని, TRAI జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


