News December 30, 2024
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఇప్పుడెలా ఉన్నాడంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.
Similar News
News January 2, 2025
రైతు భరోసాకూ దరఖాస్తులా? దారుణం: కవిత
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తోందని MLC కవిత ఆరోపించారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించారని, ఇప్పుడు రైతు భరోసాకు కూడా అప్లికేషన్లు తీసుకోవడం దారుణమని అన్నారు. ‘రైతులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఉంటారా? ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
News January 2, 2025
VIRAL: తులం బంగారం రూ.113 మాత్రమే
ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే. 1959లో తులం బంగారం ధర 113 రూపాయలే. అంటే ఒక్క గ్రాముకు రూ.10 మాత్రమే. 60 ఏళ్ల క్రితం నాటి ఈ గోల్డ్ షాపు బిల్లును చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 60 ఏళ్లలో బంగారం ధర ఇన్ని రెట్లు పెరిగిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే రూ.78వేలు కావాల్సిందే. అప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కొనేందుకు డబ్బులు ఉండకపోయేవని పెద్దలు చెప్తుండేవారు.
News January 2, 2025
BSFపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
చొరబాటుదారులు బెంగాల్లోకి ప్రవేశించేలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకరిస్తోందని CM మమత ఆరోపించారు. BSF పరిధిలోని ఇస్లాంపుర్, సితాయ్, చోప్రా సరిహద్దుల నుంచి చొరబాటుదారుల్ని అనుమతిస్తున్నారని అన్నారు. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచి, ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో BSF అక్రమాలకు మద్దతిస్తూ తమను నిందించవద్దని రాజకీయ ప్రత్యర్థులకు సూచించారు.