News December 6, 2024
పుష్ప-2.. తగ్గేదేలే

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా తొలి రోజు హిందీలో రూ.72కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పోస్టర్ విడుదల చేసింది.
Similar News
News December 26, 2025
ఇలా చేస్తే మానసిక ఆందోళన దూరం!

ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురై ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేవారు కొన్నింటిని పాటిస్తే ప్రశాంత జీవితం సొంతమవుతుంది. ‘మైండ్‌ఫుల్ వాకింగ్ అంటే నడుస్తూ పాదాలు నేలను తాకుతున్న స్పర్శ, కాళ్ల కదలికలపై దృష్టి పెట్టాలి. ఇది వర్తమానంలో ఉంచుతుంది. తినేటప్పుడు టీవీ చూడకుండా రుచి, వాసనను ఆస్వాదించాలి. అలాగే హాయిగా కూర్చొని కళ్లు మూసుకొని శ్వాసను గమనిస్తే ఆందోళన దూరమవుతుంది’ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
News December 26, 2025
బంగ్లాదేశ్ అందరిదీ: తారిఖ్ రెహమాన్

రాజకీయం, మతాలతో సంబంధం లేని బంగ్లాదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ అన్నారు. దేశ పౌరులు శాంతి కాంక్షించాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్లినవారు సురక్షితంగా తిరిగి రాగల దేశాన్ని చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశం ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు సమానంగా చెందుతుందన్నారు. 17ఏళ్ల తర్వాత దేశంలో అడుగుపెట్టిన తారిఖ్ PM రేసులో ఉన్నారు.
News December 26, 2025
యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్‌ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.


