News November 25, 2024
‘ప్రీమియర్స్’ సేల్స్‌లో పుష్ప-2 సంచలనం
అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. డిసెంబర్ 4న అమెరికా ప్రీమియర్స్ కోసం అత్యంత వేగంగా 50,000 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు సాధించింది. ‘పుష్ప కేవలం చరిత్ర సృష్టించట్లేదు. ప్రతి చోటా తన రూల్‌ను ముద్రిస్తున్నాడు’ అని మేకర్స్ రాసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
Similar News
News November 25, 2024
పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
TG: మాజీ MLA పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. లగచర్ల ఘటనకు సంబంధించి తనపై 3 కేసులు నమోదు చేశారని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఒక ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయొద్దని సుప్రీం తీర్పులను పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దాడి ఆధారంగా పోలీసులు ఆ కేసులు నమోదు చేశారని ఏఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
News November 25, 2024
లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న PILs తిరస్కరించిన సుప్రీంకోర్టు
రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న 3 పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంతో పాటు పీఠికనూ సవరించే అధికారం పార్లమెంటుకే ఉందని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ PV సంజయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు 42వ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ 2 పదాలను పీఠికలో చేర్చారు. వీటిని తొలగించాలని మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సహా కొందరు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు.
News November 25, 2024
కేర్‌టేకర్ చనిపోయిన రోజే జిరాఫీ మృతి
కొందరికి జంతువులతో ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. జంతువులూ అలాంటివారిని ఎంతో ప్రేమిస్తుంటాయి. స్కోప్జే జూలో పనిచేసే కేర్‌టేకర్ ట్రాజ్‌కోవస్కీ కూడా అలాంటి కోవకు చెందినవారే. పదేళ్లపాటు ఫ్లాపీ అనే జిరాఫీని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి ఆహారంతో పాటు అన్ని బాగోగులు చూసుకునేవారు. అయితే, గత ఏడాది నవంబర్ 26న అనుకోకుండా ట్రాజ్‌కోవస్కీ చనిపోగా గంటల వ్యవధిలోనే జిరాఫీ కూడా చనిపోయింది.