News December 27, 2024
రికార్డు సృష్టించిన పుష్ప-2 మూవీ
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.740.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన 3వ వారంలోనూ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. 22 రోజుల్లో ఈ సినిమాకు బాలీవుడ్లో రూ.740.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రూ.1719.5 కోట్లు కలెక్ట్ చేసింది.
Similar News
News December 28, 2024
పొంగల్ పోరు.. ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు?
ఈ సారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. సంక్రాంతి విన్నర్స్గా పేరున్న బాలయ్య, వెంకీ మామతో పాటు ఈసారి రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మూడు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి?
News December 28, 2024
DAY 3: ఈ రోజు భారత్దే
బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. 8వ వికెట్కు నితీశ్-సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీశ్ సెంచరీ చేసిన తర్వాత వెలుతురు లేమితో ఆట నిలిచిపోగా ఇవాళ్టికి ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్సులో AUS 474 పరుగులు చేయగా భారత్ 116 పరుగులు వెనుకబడి ఉంది. AUS బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు.
News December 28, 2024
కాంగ్రెస్ ఎన్నడూ మన్మోహన్ సింగ్ను గౌరవించలేదు: BJP నేత
మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని BJP నేత సుధాంశు త్రివేది ఆరోపించారు. బతికున్నప్పుడు వాళ్లెప్పుడూ ఆయన్ను గౌరవించలేదని విమర్శించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు. మోదీ ప్రభుత్వం ప్రణబ్, మాలవీయ, PVని భారతరత్నతో గౌరవించింది. కాంగ్రెస్లో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు కాకుండా పదేళ్లు ప్రధానిగా చేసింది మన్మోహన్ ఒక్కరే. పటేల్, శాస్త్రి, పీవీని వాళ్లు అవమానించారు’ అని వివరించారు.