News December 16, 2024

OTTలోకి పుష్ప-2.. ఎప్పుడంటే?

image

పుష్ప-2 దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ పెట్టిన 5 వారాల డీల్ ప్రకారం జనవరి 8 లేదా 9న స్ట్రీమ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే రూ.1,400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

Similar News

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.

News December 5, 2025

బ్యాగ్ కొనే ముందు..

image

ఒకప్పుడు హ్యాండ్ బ్యాగ్ అలంకారమే కావొచ్చు. కానీ ఇప్పుడు అవసరం. అందుకే దీన్ని ఎంచుకొనేటప్పుడు టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. బ్యాగు కొనేముందు ఏ అవసరానికి కొంటున్నారో స్పష్టత ఉండాలి. అందులో పెట్టే వస్తువులను బట్టి దాని పరిమాణం ఉండాలి. అంతేకాకుండా అది మీ శరీరాకృతికి నప్పేలా ఉండాలి. పొట్టిగా ఉన్నవారికి పెద్ద బ్యాగులు అంతగా నప్పవు. నాణ్యత బాగుండాలి. లోపలి లైనింగ్ వాటర్ ప్రూఫ్ అయి ఉంటే మరీ మంచిది.

News December 5, 2025

మీరు ఇలాగే అనుకుంటున్నారా?

image

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.