News December 4, 2024

‘పుష్ప-2’ రిలీజ్: అల్లు అర్జున్ పోస్ట్ వైరల్

image

‘పుష్ప-2’ రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు ఆయన కుమారుడు అయాన్ లేఖ రాశారు. దీనిని ఆయన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘ఇవాళ ప్రపంచంలోనే గొప్ప నటుడికి ప్రత్యేకమైన రోజు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. సినిమాల్లో మీ విజయం పట్ల నేను గర్విస్తున్నా. ఫలితం ఎలా ఉన్నా నువ్వెప్పటికీ నాకు హీరోనే. ఇట్లు బుజ్జిబాబు’ అని పేర్కొన్నారు. దీన్ని షేర్ చేస్తూ ఇప్పటివరకు తన అతిపెద్ద అచీవ్‌మెంట్ ఇదేనని అర్జున్ తెలిపారు.

Similar News

News March 17, 2026

క్లైమాక్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిన హరీశ్ శంకర్!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో విలన్‌ని ఓడించి అంతం చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్‌ను బ్రేక్ చేసి సరికొత్తగా ప్లాన్ చేశాం. సినిమా చివరి వరకు ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు’’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

News March 17, 2026

ఈనెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్

image

భద్రాచలంలో ఈ నెల 27న జరిగే రాములోరి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఉగాది రోజున బ్రహ్మోత్సవ సందడి ప్రారంభం కానుండగా.. అదేరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ దంపతులను నవమి వేడుకలకు ఆహ్వానించనున్నారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో రూ.100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు.

News March 17, 2026

ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి: KTR

image

TG: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై KTR విమర్శలు గుప్పించారు. ‘ఎవరు, ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి? పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నవారా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న రైతులా? నెలకు రూ.2500 కోసం వేచి చూస్తున్న ఆడబిడ్డలా? బెనిఫిట్స్ అందని ఉద్యోగులు, పెన్షన్‌దారులు, పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా’ అని ధ్వజమెత్తారు.