News June 12, 2024
‘పుష్ప2’ రిలీజ్ వాయిదా?

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ రిలీజ్ వాయిదా పడొచ్చని టీటౌన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రకటించిన తేదీ ప్రకారం 2024 ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ కోసం అదనంగా మరో నెల సమయం పట్టేలా ఉందని, జూలై చివరికల్లా షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఫిలిం ఎడిటర్ మారడంతో పాటు vfxపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
యువరాజ్, ఉతప్ప, సోనూసూద్లకు ED సమన్లు

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోనూసూద్లకు ED సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్(1xBet)కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమీ చక్రవర్తిలను ED విచారించింది. కాగా 1xBet యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నటి ఊర్వశీ రౌతేలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది.
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.