News January 7, 2025
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ వచ్చేస్తోంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా నిడివి మరింత పెరగనుంది. 20 నిమిషాల ఫుటేజీని కలిపి కొత్త వెర్షన్ను ఈనెల 11 నుంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. రీలోడెడ్ వెర్షన్ రాబోతోంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.1810 కోట్లు వసూలు చేయగా పండుగ సందర్భంగా హిందీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 8, 2025
ఆయన ఆడిషన్ అడిగితే షాకయ్యా: హీరోయిన్
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కాల్ చేసి ఆడిషన్ అడిగితే షాకైనట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలిపారు. మొదట అనిల్ కాల్ చేయగానే ఎవరో తెలియదని చెప్పినట్లు వెల్లడించారు. ఆయన గురించి గూగుల్ చేసి తెలుసుకున్నట్లు చెప్పారు. సినిమాలో రోల్ కోసం లుక్ టెస్టు చేయాలని దర్శకుడు కోరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య కనిపించనున్నారు.
News January 8, 2025
చంద్రబాబు వస్తున్నారు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ట్వీట్
స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2025 వార్షిక సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ X వేదికగా ప్రకటించింది. 2024లో 125 దేశాల ప్రతినిధులు ఫోరమ్కు హాజరవగా ఈ ఏడాది కూడా G7 &G20 దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ప్రపంచ ప్రజాప్రతినిధులు రానున్నారు.
News January 8, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ఈ 38 ఏళ్ల ప్లేయర్ కెరీర్లో 198 వన్డేలు, 122 T20లు, 47 టెస్టులు ఆడారు. 3 ఫార్మాట్లలో కలిపి 13,463 రన్స్ చేశారు. అందులో 23 సెంచరీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్లో చివరి వన్డే ఆడారు. వన్డేల్లో కివీస్ తరఫున డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్గా నిలిచారు.