News December 5, 2024

పుష్ప-2 REVIEW & RATING

image

పుష్ప-1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరాడన్నదే కథ. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్‌లో బన్నీ నటవిశ్వరూపం చూపించారు. శ్రీవల్లి నటన, ప్రీ ఇంటర్వెల్, సాంగ్స్ ప్లస్. సెకండాఫ్‌లో ఎమోషన్లకు పెద్దపీట వేసిన డైరెక్టర్ స్టోరీలో కీలకమైన స్మగ్లింగ్‌ను పక్కనబెట్టారు. సాగదీత సీన్లు, రన్‌టైమ్, విలనిజంలో బలం లేకపోవడం మైనస్. సుక్కు మార్క్ మిస్ అయింది. RATING: 3/5

Similar News

News March 19, 2026

కొత్త పార్టీ.. కవితకు ఊరట

image

TG: పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ECకి కోర్టు సూచించింది. ఇక విచారణ సందర్భంగా EC సూచించిన లోపాలు సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక తప్పులు సరిచేసి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. కాగా కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఈసీ కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే.

News March 19, 2026

మూడో బిడ్డకు జన్మనిచ్చిన దినేశ్ కార్తీక్ దంపతులు

image

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు DK తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించిన విషయం తెలిసిందే. కాగా కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడారు.

News March 19, 2026

అమెరికాలోకి డ్రోన్లు.. హై అలర్ట్‌లో వాషింగ్టన్!

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నాయర్ మిలిటరీ బేస్‌పై గుర్తుతెలియని డ్రోన్లు తిరగడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే US విదేశాంగ మంత్రి రూబియో, రక్షణ మంత్రి హెగ్‌సెత్ నివాసాలు ఉండటంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. గత 10 రోజులుగా ఇక్కడ డ్రోన్ల కదలికలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.