News October 17, 2024
‘పుష్ప-2’ సంచలనం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ రిలీజ్కు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సినిమా DEC 6న రిలీజ్ కానుండగా అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ & శాటిలైట్ రైట్స్ను ఆల్టైమ్ రికార్డు ధరకు విక్రయించినట్లు టాక్. థియేట్రికల్ రైట్సే రూ.650 కోట్లకు కోట్ చేశారని సమాచారం. ‘పుష్ప’కు సీక్వెల్గా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.
Similar News
News January 17, 2026
ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి గుర్తించుకోండి

ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అవసరమే అయినా, సరైన అవగాహన లేకుంటే నష్టమే వస్తుంది. పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీల ఆఫర్లను కంపేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ నిబంధనలను పూర్తిగా చదవాలని, క్లెయిమ్ ప్రక్రియ వేగంగా జరిగే కంపెనీలను ఎంచుకోవాలని అంటున్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి రైడర్లను తీసుకుంటే మరింత బాగుంటుంది.
News January 17, 2026
50 ఏళ్ల క్రింద మేడారం జాతర.. ఫొటోలు

TG: దాదాపు 5 దశాబ్దాల క్రితం మేడారం జాతర ఎలా ఉండేదో తెలిపే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు సమ్మక్క ఆగమనం, జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. మొక్కులు సమర్పిస్తున్న భక్తుల జనసందోహం అద్భుతంగా ఉంది. 1970 నాటి ఈ అరుదైన చిత్రాలను ఓ మ్యాగజైన్లో ప్రచురించారు.
News January 17, 2026
OFFICIAL: NDA ఘన విజయం

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 227 వార్డుల్లో బీజేపీ 89 స్థానాలు, శివసేన (శిండే వర్గం) 29 సీట్లతో మొత్తంగా 118 సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు శివసేన (UBT) 65, MNS 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమి 24, AIMIM 8, NCP 3, సమాజ్వాదీ పార్టీ 2 , NCP (SP) ఒక్క సీటు మాత్రమే గెలిచింది.


