News November 26, 2024
పుష్ప-2 షూటింగ్ పూర్తి.. అల్లు అర్జున్ పోస్ట్

పుష్ప-2 షూటింగ్ పూర్తైనట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. పుష్ప లాస్ట్ డే షూట్ అంటూ బన్నీ ఓ ఫొటోను పంచుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన సీన్ షూటింగ్ ఇవాళ జరిగినట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. ‘పుష్ప యూనిట్‌తో ఐదేళ్ల ప్రయాణం ముగిసింది. అద్భుతమైన ప్రయాణం’ అంటూ లవ్ సింబల్‌ను ఆయన పోస్ట్ చేశారు. కాగా డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News January 5, 2026
అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
News January 5, 2026
ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.
News January 5, 2026
ప్రీ డయాబెటీస్ ఉంటే ఇవి తినాలి

షుగర్ పేషెంట్స్ ముందుగా ‘ప్రీ డయాబెటిక్’ దశను దాటే డయాబెటిక్‌గా మారుతారు. అయితే డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం ద్వారా దీన్ని రివర్స్ చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. మెంతులు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, ఉసిరి రోజూ తీసుకోవడం వల్ల షుగర్ రాకుండా నివారించొచ్చంటున్నారు. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.


