News May 27, 2024
తుది దశకు చేరుకున్న పుష్ప-2 షూటింగ్?

పుష్ప-2 షూటింగ్ తుదిదశకు చేరుకుందని, మూవీ టీమ్ ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయడంపై దృష్టి పెట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ వారం నుంచి రెండు వారాలకు పైగా పతాక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ షూట్ ఉంటుందని సమాచారం. ఈ పాటలో త్రిప్తి దిమ్రి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది.
Similar News
News November 26, 2025
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి: రాష్ట్రపతి

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి. 25Cr మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అతిపెద్ద ఘనత. ఆర్థిక ఏకీకరణలో భాగంగా GST తీసుకొచ్చాం. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్ తీసేశాం. Art370ని రద్దు చేశాం’ అని చెప్పారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<


