News April 30, 2024
రేపు పుష్ప-2 సాంగ్ విడుదల

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తోన్న పుష్ప-2 మూవీ నుంచి వరుస అప్డేట్‌లు ఇస్తూ మేకర్స్ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. సినిమాలో ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాటను రేపు ఆరు భాషల్లో విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అప్డేట్‌ను ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు వెల్లడిస్తామన్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News March 3, 2026
ఖమేనీ హత్యపై మౌనం బాధ్యతారాహిత్యం: సోనియా గాంధీ

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుబట్టారు. ఇది ‘న్యూట్రల్’గా ఉండడం కాదని, విదేశాంగ విధానంలో ‘బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను చంపడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై భారత్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
News March 3, 2026
నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రామరాజు(85) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతో HYDలోని మధురానగర్ స్వగృహంలో ఈ ఉదయం చనిపోయారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు శివాజీ రాజా ఇంటికి చేరుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
News March 3, 2026
గుంటూరు జిల్లాలో 14 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

గుంటూరు జిల్లా స్త్రీ&శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, MTS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


