News December 31, 2024

‘పుష్ప-2’ తొక్కిసలాట ఎఫెక్ట్.. మహేశ్ ఫ్యాన్ క్లబ్ ట్వీట్!

image

న్యూ ఇయర్ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’ మరోసారి రిలీజ్ కానుంది. సుదర్శన్ థియేటర్‌లో స్పెషల్ షోపై ఫ్యాన్ క్లబ్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటనను గుర్తుచేసింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని, చిన్న ఇష్యూ చేసినా పోలీస్ కేసు అవుతుందని హెచ్చరించింది. మహేశ్ బాబుకు చెడ్డ పేరు తేవొద్దంటూ సూచించింది.

Similar News

News December 2, 2025

టీజీ అప్డేట్స్

image

* ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటికే 152 బస్సులు అందజేత
* రేపు లేదా ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో రామగుండం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) టీమ్.
* ఈ నెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్. పూర్తి వివరాలకు <>euffindia.com<<>>ను విజిట్ చేయండి

News December 2, 2025

ఈ సారి చలి ఎక్కువే: IMD

image

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.

News December 2, 2025

ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-<>IICT<<>> 10 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్(జనరల్ నర్సింగ్/ANM), ఫార్మసీ టెక్నీషియన్, టెక్నీషియన్( క్యాటరింగ్&హాస్పిటాలిటీ) పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం రూ.39,545 చెల్లిస్తారు. ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in