News March 13, 2025
పుష్ప 2 తొక్కిసలాట: ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడంటే..

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడు. కానీ నాడీ వ్యవస్థ దెబ్బతిని మాటలు అర్థం చేసుకోలేక, కుటుంబీకులను గుర్తించలేకపోతున్నాడు. స్పర్శ కూడా తెలియడం లేదని డాక్టర్లు చెప్పారని BBC కథనంలో పేర్కొంది. నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్ట్రోమీ ప్రక్రియతో ఆస్పత్రి సిబ్బంది ఆహారం పంపిస్తున్నారు.
Similar News
News October 24, 2025
SEX WARFARE: అందమే ఆయుధం

జనరేషన్లు మారేకొద్ది యుద్ధాల్లోనూ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. శత్రువులను దెబ్బతీసే సరికొత్త మార్గాలపై దేశాలు దృష్టిపెడుతున్నాయి. అందమైన అమ్మాయిలను వలగా వేసి శత్రు రహస్యాలు రాబట్టే SEX WARFARE, HONEYTRAPS ఇందులో భాగమే. రష్యన్, చైనీస్ యువతులు తమ టెక్ కంపెనీల్లో స్పైలుగా పనిచేస్తున్నారని US మీడియా పేర్కొంది. సీక్రెట్ ఫైల్స్, ఇన్ఫర్మేషన్ కోసం ఉద్యోగులను పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటున్నారంది.
News October 24, 2025
సీటింగ్ పర్మిషన్ తీసుకొని!

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. 43 సీట్ల సీటింగ్‌కు పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్‌గా మార్చడమే దీనికి నిదర్శనం. ఈ బస్సుకు డయ్యూడామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశాలో ఆల్ట్రేషన్, ఫిట్నెస్ చేయించారు. 2018లో TGలో, 2023లో NOCతో డయ్యూ డామన్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ జరిగింది.
News October 24, 2025
లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్ బ్రీతబుల్ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.


