News December 5, 2024
‘పుష్ప-2’: చిరంజీవి ఇంటికి వెళ్లిన సుకుమార్

‘పుష్ప-2’ విడుదల నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవితో పాటు డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఆయన సినిమా చూస్తారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్ నేపథ్యంలో వీరు ఇలా కలవడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News April 2, 2026
దేశమంతా అమరావతి వెంట నిలబడింది: CBN

AP: అమరావతి అత్యంత పవిత్ర స్థలమని CM CBN అభివర్ణించారు. ‘దేశంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని, నదుల నుంచి జలాన్ని తెచ్చి పునీతం చేశాం. అలాంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు మూడుముక్కలాటతో విధ్వంసం చేశారు. కానీ ఇవాళ పార్లమెంటులో YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు అమరావతి వెంట నిలిచాయి’ అని ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. అమరావతిని వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామన్నారు.
News April 2, 2026
SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

IPL: SRHతో మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎషాన్ మలింగ స్థానంలో పైన్, హర్షల్ పటేల్ స్థానంలో శివాంగ్ కుమార్ SRHలోకి వచ్చారు.
SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, సలీల్, హర్ష్ దూబే, ఉనద్కత్, పైన్, శివాంగ్ కుమార్.
KKR: రహానె (C), గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, ముజరబాని.
News April 2, 2026
లేటుగా సూర్యోదయం.. త్వరగా సూర్యాస్తమయం!

TG: పెద్దపల్లి జిల్లా కొదురుపాక గ్రామం అరుదైన ప్రకృతి వింతకు నిలయం. ఈ ఊరికి నలువైపులా ఎత్తైన కొండలు ఉండటంతో ఇక్కడ 4PMకే చీకటి అలుముకుంటుంది. అందుకే దీనిని ‘మూడు జాముల కొదురుపాక’ అని పిలుస్తుంటారు. తూర్పున ఉన్న కొండల వల్ల సూర్యోదయం కూడా ఆలస్యంగానే అవుతుంది. ఈ వింతపై కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా తెరకెక్కడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (36/100)


