News April 2, 2024
పుష్ప-2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ మాస్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక పుష్ప-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానుంది.
Similar News
News October 27, 2025
BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్బంధన్లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.
News October 27, 2025
భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News October 27, 2025
డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.


