News December 26, 2024
‘పుష్ప-2’: ఆ పాట డిలీట్

‘పుష్ప-2’లోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం T SERIES తెలుగు ఛానల్లో ఈ వీడియో కనిపించడం లేదు. కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన డిసెంబర్ 24న సాయంత్రం ఈ పాటను టీ సిరీస్ విడుదల చేసింది. ఈ సాంగ్ పోలీసులను ఉద్దేశించే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News November 22, 2025
హుజురాబాద్‌లో దూరవిద్య తరగతులు ప్రారంభం

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు దూర విద్యా తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఇందిరా దేవి, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


