News December 3, 2024
‘పుష్ప-2’: వాళ్లు మిస్యయ్యారుగా..

‘పుష్ప-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినిమాలో కీలక పాత్రలు పోషించిన సునీల్, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ వంటి నటులు ఈవెంట్‌లో కనిపించలేదు. దీంతో వీరంతా ఎందుకు రాలేదన్న చర్చ మొదలైంది. మరోవైపు వేరే సినిమా షూటింగ్స్‌లో వారు బిజీగా ఉండొచ్చని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News December 26, 2025
జామలో తెల్ల సుడిదోమను ఎలా నివారించాలి?

తెల్లసుడి దోమ పిల్ల పురుగులు జామ ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. జిగురు పూసిన పసుపురంగు అట్టలను చెట్టు కొమ్మలకు వేలాడతీయాలి. తెగులు ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. తర్వాత లీటరు నీటిలో 5మి.లీ వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి హాస్టాథియాన్ 1మి.లీ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News December 26, 2025
కొత్త ఏడాదిలో వివాహానికి శుభ ముహూర్తాలివే..

Feb: 19, 20, 21, 24, 25, 26
Mar: 1, 3, 4, 7, 8, 9, 11, 12
Apr: 15, 20, 21, 25, 26, 27, 28, 29
May: 1, 3, 5, 6, 7, 8, 13, 14
Jun: 21, 22, 23, 24, 25, 26, 27, 29
Jul: 1, 6, 7, 11, Nov: 21, 24, 25, 26
Dec: 2, 3, 4, 5, 6, 11, 12
* మూఢం వల్ల Feb 17 వరకు, చాతుర్మాస్యం వల్ల Aug, Sep, Oct నెలల్లో శుభ ముహూర్తాలు లేవు: జ్యోతిషులు
News December 26, 2025
నటి మీనా కూతురిని చూశారా?

క్రిస్మస్ సందర్భంగా సీనియర్ నటి మీనా తన కూతురు నైనికతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నైనిక ఐదేళ్ల వయసులోనే దళపతి విజయ్ ‘తేరీ’ సినిమాలో బాలనటిగా కనిపించారు. ఆ సినిమా అనంతరం నటనకు బై చెప్పి చదువుపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 14 ఏళ్లు. లేటెస్ట్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మీనా భర్త 2022లో మరణించారు.


