News January 16, 2025
‘పుష్ప-2’ టికెట్ ధరలు తగ్గింపు

ఈ నెల 17 నుంచి మరో 20 నిమిషాల అదనపు నిడివితో ‘పుష్ప-2’ ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంతో పాటు నార్త్ ఇండియాలో టికెట్ రేట్లను చిత్ర యూనిట్ తగ్గించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటికే రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది.
Similar News
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.
News November 25, 2025
GAIL (INDIA) లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 25, 2025
నేడు మరో అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు!

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని APSDMA తెలిపింది. మరో 48hrsలో తుఫానుగా మారనుందని పేర్కొంది. అటు ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఇవాళ్టి నుంచి 28 వరకు ద.కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 29, 30 తేదీల్లో ద.కోస్తా. రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ, ఉ.కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.


