News December 30, 2024
పుష్ప-2: హిందీ కలెక్షన్లు ఎంతంటే?

హిందీలో ‘పుష్ప-2’ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. సినిమా విడుదలైన 25 రోజుల్లోనే రూ.770.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద నం.1 చిత్రమిదేనని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1,800 కోట్ల వసూళ్లకు చేరువైంది.
Similar News
News November 15, 2025
ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <


